
తార్నాక, దక్షిణాది ఏప్రిల్ 12: హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని శనివారం వీరాంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిక్కరించిపోయాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆంజనేయస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బజరంగ్ ఈగల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శాంతినగర్ నార్త్ లాలగూడా లో హనుమాన్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వీరాంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని చేపట్టారు. దారి పొడుగునా జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంచరించుకుంది. వీధులన్నీ ర్యాలీతో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఇంటి ముందుకు వచ్చిన ర్యాలీని స్థానిక ప్రజలు స్వాగతించి కొబ్బరికాయలు కొట్టి, హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సాయి, సంతు, సతీష్ జిమ్, చిన్న, ప్రవీణ్, మురళి, లడ్డు, వినోద్, నాని, వెంకట్, శ్రీకాంత్, వినయ్, భరత్ తదితరులు ఉన్నారు.