అదొక యజ్ఞం , మొక్కలు నాటే ఘనమైన సంకల్పం, ఒకటి కాదు రెండు కాదు, ఐదు దశాబ్దాల పాటు, వేయి కాదు లక్ష కాదు, కోటి మొక్కలను నాటిన, మన ఠీవి ఘన జీవి, వనజీవి రామయ్య ఇక లేరని, అడవి తాను ఏడుస్తుంది, ఆకు ఆకున వెదుకుతుంది ! సామాన్యుడు సైతం, అసామాన్యుడవ్వచ్చని, వనముల నెంతో పెంచీ, తన యాగం పూర్తి చేసి, మానవాళి మనుగడకై, తన జీవితాన్ని సమిధ జేసి, ప్రకృతితో మమేకమై మొక్కలతో తనేకమైన, వనజీవిని కనుగొన లేక, అడవి తాను ఏడుస్తుంది, ఆకు ఆకున వెదుకుతుంది ! ** కొండా మోహన్, DFO, 7989748529.