EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

నాన్ హై క్వాలిటీ మీటర్ల స్థానంలో హై క్వాలిటీ మీటర్ల ఏర్పాటు

Image

Hyd అంబర్ పేట, ఏప్రిల్ 11: ట్రాన్స్ కో అంబర్ పేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పాత కరెంటు మీటర్లను అంచలంచెలుగా మార్చుతున్నామని ఏడి కందగట్ల సీనయ్య తెలిపారు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న మీటర్లు అన్నీ కూడా 'నాన్ హై క్వాలిటీ' మీటర్లు ఉన్నాయని చెప్పారు. వాటి స్థానంలో ప్రస్తుతం 'హై క్వాలిటీ' మీటర్లను అమర్చుతున్నామన్నారు. దీని ద్వారా స్కాన్ చేసిన వెంటనే మీటరు రీడింగ్ వస్తుందని తెలిపారు. ఇందులో కరెంటు మీటరు స్టేటస్ ప్రకారం రీడింగ్ తీయడం ఉంటుందన్నారు. స్టేటర్ ఒకటి ఉంటే రన్నింగ్ అని, రెండు ఉంటే ఆగిపోయిందని, మూడు ఉంటే డిస్కనెక్షన్ అని, స్టేటస్ నాలుగు వస్తే మీటరు మార్చాలని వస్తుందని వెల్లడించారు. స్టేటస్ ప్రకారం మీటరు మార్చడం జరుగుతుందని తెలిపారు. నాన్ ఐఆర్ మీటర్లను ఇప్పుడు ఐఆర్ మీటర్లుగా మారుస్తున్నామని, ఈ నేపథ్యంలో ఒక నెల యావరేజ్ బిల్లు వస్తందని చెప్పారు. మీటరు మార్చుకున్న వినియోగదారులు బిల్లు ఎక్కువగా వస్తే సంబంధిత సెక్షన్ ఏఈ దగ్గరకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కువగా వచ్చిన బిల్లును వెంటనే సరిచేస్తామని తెలిపారు. వినియోగదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదరు. కరెంటు మీటరు స్టేటస్ రెండు అంటే ఆగిపోతే ఉచితంగా మారుస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కాలిపోతే మాత్రం సింగిల్ ఫేజ్ మీటరైతే రూ.1200లు, త్రీఫేజ్ మీటరైతే రూ.2700 డీడీ తీసి ఫీవర్ హాస్పిటల్ వెనుకవైపు గల కస్టమర్ కేర్ సెంటర్లో ఇవ్వాలని ఏడీఈ చెప్పారు. ఇప్పటి వరకు 90 శాతం పైగా కొత్త మీటర్లను మార్చడం జరిగిందని తెలిపారు. గోల్నాక వినాయకనగర్ కు చెందిన శ్రీధర్ విషయంలో కూడా ఇదే జరిగిందని, వారి బిల్లు విషయంలో రివైజ్ చేస్తామని చెప్పారు. వేసవిలో నిరంతర విద్యుత్.... వేసవిలో వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు జరక్కుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్ కో అంబర్ పేట సబ్ డివిజన్ ఏడీఈ కందగట్ల సీనయ్య తెలిపారు. పక్కాగా ముందస్తు ప్రణాళికలు రచించినట్లు పేర్కొన్నారు. వేసవిలో తమ శాఖకు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు విద్యుత్ సమస్యలు లేవని,రాత్రివేళ కూడా కోతలు లేకుండా సరఫరాచేస్తున్నామన్నారు. తమ పరిధిలో ఉన్న రామాలయం. గోల్నాక, అంబర్పేట సెక్షన్ల పరిధిలో మొత్తం 80వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. సప్లయ్ బాగుందని, ఎండాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ఎస్.ఈ వెంకన్న నేతృత్వంలో ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లను నియమించారని తెలిపారు. ఏఈలు, సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని, అంతరాయం కలిగితే వెంటనే స్పందిస్తారని పేర్కొన్నారు.ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలో 15 డిటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ) అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయిని కూడా పెంచడం జరిగిందన్నారు. అవసరమైన చోట లోడ్ బ్యాలెన్సింగ్ కోసం ఆడిషనల్ డీటీఆర్ లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. విద్యుత్ సరఫరా, బిల్లులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నేరుగా సంబంధిత ఏఈలను సెక్షన్ కార్యాలయంలో కలవాలని చెప్పారు.