
కాచిగూడ, ఏప్రిల్ 10 : బర్కత్ పుర ఆర్టీసీ డిపోలో అకార ణంగా తొలగించిన డీఎం అటెండర్, స్వీపర్స్ లను వెంటనే విధుల్లోకి తీ సుకోవాలని బాధితులు ఆర్టీసీ ఉ న్నతాధికారులను వేడుకున్నారు. గత ఎన్నో ఏండ్లుగా బస్ డిపోలో అటెండర్, స్వీపర్లుగా పనిచేస్తు న్నామనీ, ఇటీవలే కొత్త కాంట్రాక్టర్ గా మల్లారెడ్డి మమ్మల్ని విధులో నుంచి తొలగించినట్లు వారు పేర్కొ న్నారు. గురువారం బర్కత్ పురలో ని తుల్జాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితు రాలు అటెండర్ సుమిత్ర, స్వీపర్స్ నాగమల్లేశ్వరి, రుక్మిణి మాట్లాడా రు. గత 6సంవత్సరాలుగా అటెం డర్ గా, 10 సంవత్సరాలపాటు స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న ప్పటికీ ఇప్పటివరకు తనపై ఎలాం టి అభియోగాలు లేవని అన్నారు. డిపో మేనేజర్ మంజుల.. రెడ్డి సా మాజిక వర్గానికి చెందిన మహిళా కావడంతో, ఎస్సీ కుటుంబానికి చెందిన వాళ్ళమని చిన్నచూపు చూస్తుందని వారు వాపోయారు. మా డ్యూటీ మేము చేయడంతో పాటు మాతో, మరుగు దొడ్లు శుభ్రం చేయించడం, డిపో మేనేజర్ మం జుల పిల్లల సంరక్షణ బాధ్యతలు, సొంత పనులు చేయించుకుంటు న్నారని వారు ఆరోపించారు. ఈ విషయమై 8నెలల పాటు విసుకు చేంది డిఎంను, అధికారులను అడగడం, 3నెలలుగా మాకు జీతాలు రాలేవని అడిగినందుకు ఉద్దేశపూర్వకంగా కక్షకట్టి నూతన కాంట్రాక్టర్ మల్లారెడ్డి రావడంతో తమని విధుల నుంచి తొలగించా రని అటెండర్, స్వీపర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డీఎం.. అటెండర్ అయినా సుమిత్రను, ప లువురు స్వీపర్సులను విధుల్లోకి తీసుకోనీ, భవిష్యత్తులో తమపై ఎలాంటి వేధింపులు లేకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తానని ఆమే హెచ్చరించారు. నాకు జరిగిన ఈ అన్యాయం తమ తోటి అటెండర్స్ కు, స్వీపర్స్ కు జరగకూడదనీ, ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియా లని ఉద్దేశంతో నేను నా బాధను విలేకరుల సమావేశంలో చెబుతు న్నానునని ఆమే వెల్లడించారు.