EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

Trending Video

ప్రభుత్వం, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ-4 విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముందుగా సర్వే తలపెట్టారు. సర్వే ద్వారా ఎంపిక చేసిన పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా పేదరికం లేని సమాజం స్థాపించాలనేది సీఎం ఆలోచన. జిల్లాలో 5,20,900 కుటుంబాలు ఉన్నాయి. ప్రజల స్థితిగతులపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన 27 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. సర్వే దాదాపు పూర్తికావొచ్చిందంటున్నారు. కానీ ఇంతవరకు మూడు లక్షల కుటుంబాల లోపే సర్వే జరిగినట్లు తెలుస్తోంది. సర్వేలో అడుగుతున్న వివరాలు చెప్పేందుకు కొంత మంది ముందుకు రావడం లేదు. - సర్వే ద్వారా గుర్తించిన వివరాల ఆధారంగా ఎక్కడ ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తారోనన్న భయం వారిని వెంటాడుతోంది. పలు కుటుంబాలకు కార్లు, టాక్టర్లు, భూములు ఉన్నాయి. ఇలాంటి వారు రేషన్‌ కార్డులను విడదీసేయడం ద్వారా సంక్షేమ పథకాలను పొందుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే సమయంలో అడుగుతున్న పశ్నలకు సమాధానం రాబట్టడంతో పాటు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తరువాత కుటుంబ సభ్యుల బయోమెట్రిక్‌ను తీసుకుంటున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా తీసుకుంటున్న సంతకం వల్ల సంక్షేమ పథకాలను తీసేస్తారన్న అపోహ నెలకొంది. ఈ కారణంతో చాలా మంది సర్వేకు సహకరించడం లేదు. ఓటీపీ