EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

దేవాలయ నిర్మాణానికి దాతలు భారీ విరాళాలు -విరాళాలు అందజేసిన వారికి దేవాలయ కమిటీ సభ్యులు ఘన సత్కారం...

Image

చారకొండ అక్టోబర్ 05 : జేపల్లి గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణ అభివృద్ధికి జేపల్లి గ్రామంలో ఆదివారం పలువురు నుంచి భారీ విరాళాలు అందజేశారు. విద్యుత్ శాఖ లైన్ మెన్ మల్లెపాకుల శ్రీనివాసులు రూ.25,116, మల్లెపాకుల పెద్ద శేఖర్ రూ. 15,116, మాజీ వార్డు సభ్యులు మల్లెపాకుల శేఖర్ రూ.10,116, సీనియర్ జర్నలిస్టు మల్లెపాకుల పరుశురాం రూ.10,116, జక్కుల కృష్ణ రూ.10,116, మల్లెపాకుల సైదులు (ఆర్టీసీ) 5,116, మల్లెపా కుల రఘునందన్ రూ.5,116, మాడ్గుల ప్రశాంత్ రూ.5,116, ఇటిక్యాల గోవర్ధన్ రెడ్డి రూ.5016, యం.డి. బురాన్ రూ.5,000, మురళీధర్ రెడ్డి రూ. 3,116, మద్ది వెంకట్ రెడ్డి 3,016, దాదేమోని నరసింహ రూ.2,016, దాదేమోని శారదమ్మ రూ.2,116, యం. డి. ఫరీద్ రూ.2116, మల్లెపాకుల బిక్షపతి రూ. 2,116, వసంతపు అల్లాజీ రూ. 2,116, జక్కుల మల్లేష్ రూ.1,116 విరాళంగా అందజేశారు. గ్రామ పెద్దలు గునుగంటి శ్రీనివాస్ రావును మర్యాద పూర్వకంగా కలవడంతో దేవాలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విరాళాలు అందజేసిన వారికి దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.