EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. సిందూర్ మొక్క నాటిన మోదీ.. ప్రజలకు కీలక పిలుపు

Image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద మొక్కను నాటి, పచ్చదనం ప్రతీ ఇంటి పరిధిలోకి చేరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల గుజరాత్‌ కచ్‌ ప్రాంతానికి తన పర్యటన సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. 1971 యుద్ధంలో అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళల బృందం ఆయనను కలిసి, వారికిచ్చిన గుర్తుగా సిందూర్ మొక్కను బహుకరించారు. ఆ సమయంలో ప్రధాని, ఆ మొక్కను తన నివాసంలో నాటుతానని మాట ఇచ్చారు. ఇప్పుడు, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ మాటను నెరవేర్చారు.