గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, భార్య ఉపాసనతో కలిసి కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంటిని సందర్శించారు. బ్రహ్మానందం చిన్న కుమారుడు డాక్టర్ సిద్ధార్ధ్ దంపతులకు ఇటీవలే బిడ్డ పుట్టడంతో ఆయన మరోసారి తాత అయ్యారు. ఈ శుభ సందర్భంలో ఆదివారం మధ్యాహ్నం చరణ్, ఉపాసన వారింటికి వెళ్లి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ, బ్రహ్మానందాన్ని గట్టిగా హత్తుకున్న చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.