EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

ఒక్ వుడ్ స్కూల్‌లో ఉపాధ్యాయుల కోసం ఎడ్యుకేషనల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్

Image

హైదరాబాద్-దక్షిణాది ప్రతినిధి : ఒక్ వుడ్ స్కూల్‌లో ఇటీవల నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఎంతో ప్రేరణ కలిగించింది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు సబ్జెక్టులకు సంబంధించిన సవాళ్లను చర్చించడానికి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే ఆధునిక బోధన పద్ధతులను ఆవిష్కరించడానికి ఒక వేదికగా నిలిచింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల ఛైర్మన్ శ్రీ లక్ష్మా రెడ్డి , ప్రముఖ విద్యావేత్త డా. లయన్ కొమటి రెడ్డి గోపాల్ రెడ్డి తమ సందేశాలతో ఉపాధ్యాయులకు అధ్యాపక వృత్తిలో ప్రేరణ కల్పించారు. ఈ వేగంగా మారుతున్న కాలంలో ఉపాధ్యాయులు నిరంతరం తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, విద్యార్థులకు బలమైన విద్యా పునాదులు వేయడానికి సృజనాత్మక బోధన పద్ధతులను అవలంబించాలని డా. గోపాల్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గణిత బోధన పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల్లో గణిత భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు సరళమైన వ్యూహాలను చర్చించారు. తమ తరగతి గది అనుభవాలను పంచుకోవడంతో పాటు, సాధారణ సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొన్నారు. కాగా ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు కొత్త ఆలోచనలను, సృజనాత్మక బోధనపై నమ్మకాన్ని కలిగించింది. సమారిటన్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్ తమ విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించాలనే తమ విజన్‌ను మరింత బలోపేతం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మాధవి సంగీ, ఇన్‌ఛార్జ్ షాను, బజాజ్ నందిని, సమారిటన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ దేవి, వైస్ ప్రిన్సిపాల్ అంజలి, నాలుగు బ్రాంచ్‌ల ఇన్‌ఛార్జ్‌లు, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.