కాచిగూడ, ఆగస్టు 16 (దక్షిణాది న్యూస్): రాష్ట్రంలోని 16 లక్షల 75వేల మంది విద్యార్థుల రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన విద్యార్థు ఫీజు బకాయిల విషయంపై చర్చించి వినతి పత్రం అందజేశారు. స్కాలర్ షిప్స్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఉన్నత విద్యకు విద్యార్ధులు దూరమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.