హైదరాబాద్- దక్షిణాది : గండిపేటలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో 2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఆగస్టు 20 (బుధవారం)న ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సీబీఐటీ క్రికెట్ గ్రౌండ్, కొకాపేటలో జరుగుతుంది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కాలేజీ వాతావరణం, విద్యా విధానాలను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మధ్యాహ్నం 1 గంట నుంచి అందరికీ భోజన వసతి కల్పిస్తారు. అనంతరం, మధ్యాహ్నం 2 గంటల నుంచి సంబంధిత విభాగాధిపతులు అకడమిక్ వివరాలను అందజేస్తారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులందరూ స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. వర్షం పడే అవకాశం ఉన్నందున, రైన్‌కోట్లు వంటి రక్షణ వస్తువులను వెంట తెచ్చుకోవాలని ఇన్‌స్టిట్యూట్ సూచించింది.