ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, ఆగస్టు16 (దక్షిణాది న్యూస్) ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు నందు క్రమంగా వరద పెరుగుతుంది. ప్రస్తుతం 31000 క్యూసెక్కుల పైగా వరద మున్నేరు నుంచి దిగువకు ప్రవహిస్తుంది. వరద ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు అంచనా. నందిగామ డివిజన్, మున్నేరు పరిసరాల నందు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, సురక్ష ప్రాంతాలకు వెళ్ళాలి అని సూచించారు. మున్నేరు సంబంధిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎటువంటి అవాంచచనియ సంఘటనలు జరగకుండా చూడాలి అని ఆదేశించారు.