నెల్లూరు - దక్షిణాది ప్రతినిధి : నెల్లూరు సిటీలోని 45వ డివిజన్, బృందావనం సెంటర్‌లో గత పదేళ్లుగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు, కల్యాణం నిర్వహిస్తున్న నాగేంద్ర యాదవ్ గారిని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అభినందించారు. నాగేంద్ర మరియు 45వ డివిజన్ జనసేన నాయకులు సుధా మాధవ్ ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొన్న కిషోర్ గునుకుల మాట్లాడుతూ, సనాతన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. నేటి బిజీ ప్రపంచంలో దైవకార్యాలను నిర్వహించడం ఒక గొప్ప ప్రయత్నమని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అల్లరి కృష్ణుడు అందరి ఆపదలను దూరం చేసి సుపరిపాలన సాగించాలని, ఇలాంటి భగవత్కార్యాలు మరిన్ని జరగాలని ఆయన ఆకాంక్షించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మాన్ని కాపాడుకుంటూ లోకకళ్యాణం కోసం కృషి చేయాలని కోరారు.