ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. 'అడవితల్లి బాట' పేరుతో రూ.1005 కోట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 652 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాలు, కొండల అడ్డంకులు ఉన్నా, పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.