రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతోందని తెలిపింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డుతో ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణించవచ్చిన పేర్కొంది.