EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

సాక్షి ఎడిటర్ సహా... ఆరుగురు జర్నలిస్టులపై ఆక్రమ కేసులు ఎత్తివేయా

Image

రంగారెడ్డి జిల్లా- దక్షిణాది ప్రతినిధి, ఏప్రిల్ 11: సాక్షి దినపత్రిక సంపాదకులు ధనంజయరెడ్డితో సహా పల్నాడు జిల్లాకు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసనపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, కార్యదర్శి ఇ. చంద్రశేఖర్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీబీజేఏ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.రాధిక, ప్రధాన కార్యదర్శి జ్యోతిబసు తదితరులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మాచర్ల మండలంలో జరిగిన పి హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు ప్రచురణ వార్త కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో జర్నలిస్టులపై కేసు బనాయించడం సరికాదని పేర్కొన్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఆ పనికి బదులుగా ఈ తరహా కేసులు పెట్టడం అన్యాయమని వారు ఖండించారు. ప్రచురితమైన సమాచారంలో తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు వివిధ మార్గాలున్నాయని గుర్తు చేశారు. ఇంకా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేసుకోవచ్చని వివరించారు. ఆ అవకాశాలను వదిలేసి మీడియాను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదని అన్నారు. సాక్షి సంపాదకులు ధనంజయ రెడ్డి, ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అందుకు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య