
అసలు ప్రశ్న ఏమిటంటే... ఇవాల్టి తరానికి ఔరంగబేబు అవసరమా? ఆయన సమాధి తొలగించవచ్చా? సమాధానం ఒక్కటే..ఔరంగజేబు ఈ తరానికి అవసరం లేదు" అని సునీల్ అంబేకర్ అన్నారు. ఏవిధమైన హింస సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా ఇటీవల విడుదల 'ఛావా' సినిమా తర్వాత మహారాష్ట్రలో భావోద్వేగాలు తీవ్రమయ్యాయి. శంభాజీని ఔరంగజేబు చంపిన విధానం ప్రధానంగా ఈ భావోద్వేగాలకు కారణమవుతోంది. ఖుల్దాబాద్‌లోని ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో పవిత్ర వ్యాఖ్యలున్న ఒక వస్త్రాన్ని దహనం చేశారనే వదంతులు వ్యాప్తి చెందడంతో నాగపూర్‌లోని పలు చోట్ల ఒక వర్గం వారు హింసాకాండకు దిగారు. ఇది పక్కా ప్లానింగ్‌తో చేపట్టిన కుట్రగా మహారాష్ట్ర సర్కార్ అనుమానిస్తోంది.