EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి----బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

Image

హైదరాబాద్, ఏప్రిల్ 16): కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి బీసీలకు ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా ఇంచార్జీ సూర్యనారాయణ అధ్యక్షతన బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, సివిల్ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించకుండా మోసి చేసిందని ఆరోపించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న మెయింటెనెన్స్ కాంట్రాక్టులను బీసీలకు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున న్యాయ నిపుణులతో లోతుగా చర్చించి అమలు కోసం పగడ్బంధీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, రాజకీయ రిజర్వేషన్ల కోసం మరోక బిల్లు ఉందని, ఈరెండు బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సంక్షేమానికి ఉపయోగపడే బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాలని, అమల్లోకి వచ్చే విధంగా చూడాలని ఆయన కోరారు.