
కోదాడ, ఏప్రిల్ 12( . దక్షిణాది న్యూస్). సూర్యాపేట జిల్లా, అనంతగిరిలో పిఎసిఎస్ వారు ఏర్పాటుచేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం సేకరణ నను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులతో అధనపు కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరాతీసారు. కాంటా వేసేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం యొక్క తేమశాతాన్ని పరిశీలించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేసి, వారికి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యత ప్రమాణాలు లోబడి ధాన్యం తీసుకుని వచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటవెంటనే బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లులో ఎప్పటికప్పుడు ట్రక్ షీట్స్ తెప్పించుకొని టాబ్లలో ఎంట్రి చేయాలని ఆదేశించారు. రైతుల నుండి ధాన్యం కొన్న వెంటనే వారికి పూర్తి వివరాలుతో కూడిన రసీదు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. అనంతరం కోదాడ డివిజన్లోని అనంతగిరిలో గల జయలక్ష్మి రైస్ మిల్లును ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం లారీలు వచ్చిన వెంటనే అన్లోడ్ చేయాలని హమాలీలను ఎక్కువగా పెట్టుకోవాలని సూచించారు. దొడ్డిబియ్యం, సన్న బియ్యం మిల్లులో సపరేట్గా పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంట డిఎస్ఓ రాజేశ్వరరావు, కోదాడ రైస్ మిల్లుల అసోసియేషన్ ప్రెసిడెంట్ మధు, పిఎసిఎస్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.