EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

శ్రామిక వర్గ రాజ్యస్థాపనే లక్ష్యం: జాన్ వెస్లీ

Image

సూర్యాపేట ,ఏప్రిల్ 12(దక్షిణాది న్యూస్). సామాజిక న్యాయ పోరాటాలు బలోపేతం... ప్రభుత్వ రంగ రిజర్వేషన్లు కాపాడాలి... కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలి.. హెచ్ యు సి,ఫార్మా,రామోజీ భూములపై ముఖ్యమంత్రి స్పందించాలి దేశంలో శ్రామిక వర్గ రాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, సామాజిక న్యాయ పోరాటాలు బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 నుండి 14 వరకు క్షేత్రస్థాయి వరకు సామాజిక అధ్యయన యాత్రలు చేపడుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.శనివారం పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి మత,కుల గర్షణలు,మహిళలపై దాడులు పె చ్చరిల్లిపోయాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద,కార్పొరేట్ విధానాలను అనుకూలంగా బిజెపి పనిచేస్తుందని విమర్శించారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి నుండి ఈ నెల 14 అంబేద్కర్ వర్ధంతి వరకు పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో అధ్యయన యాత్రలు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా కులగణ న చేపట్టాలన్నారు.రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన దానిపై కేంద్రం పెదవి ఇప్ప డం లేదన్నారు.రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇక్కడ ఒక మాట,అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై పెను బారాలు మోపారన్నారు. గ్యాస్ ధరల వల్ల 7300 కోట్ల భారం, పెట్రోల్ ,డీజిల్ వల్ల 73 వేల కోట్ల భారం ప్రజలపై పడిందన్నారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి, టెలికం,విశాఖ ఉక్కు వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని చూస్తుంద న్నారు.ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లను నిరుపేయ oగా మారిపోతున్నాయని,వాటిని కాపాడుకోవాలన్నారు,ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఒక్క రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని బర్తీ చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారులకు వచ్చి నేటికీ అమలకు నోచుకోలేదన్నారు. హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ భూములు విషయంలో బిజెపి ఎంపీల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు.ఫార్మా భూములకు సంబంధించి రైతులకు ఇచ్చిన హామీలు ప్రతి రైతుకు 120 కుంటల భూమి,ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని ఆహామీని,2013 చట్ట ప్రకార నష్టపరిహారం అందించిన తర్వాతే ముందుకు పోవాలని సూచించారు.హెచ్ యు సి,ఫార్మా, రామోజీ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశానికి ముందు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగన్న, మల్లు లక్ష్మిలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, చెరుకు ఏకలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, ధనియాకుల శ్రీకాంత్ వర్మ , పులుసు సత్యం, నాయకులు వట్టెపు సైదులు, పోషణ బో యిన హుస్సేన్, వజ్జె శ్రీను, యాదగిరి, చినపంగి నరసయ్య, నెమ్మాది శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.