EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

ఉగాది పురస్కారం అందుకున్న ఆంధ్రప్రభ రిపోర్టర్ పరమేష్

Image

సూర్యాపేట : ఏప్రిల్ 12. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రిపోర్టర్ పల్లా పరమేష్ ఉగాది పురస్కారం అందుకున్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌ రాష్టం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ఉత్తమ జర్నిస్టులకు ఉగాదిపురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. అక్షర అస్త్రాలతోసమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తున్న పాత్రికేయులను తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 37విభాగాలలో 100 మంది జర్నలిస్టులను ఎంపిక చేసి జర్నిలస్టులకు ఉగాది పురస్కారాలు అందించారని ఆయన విలేకరులకు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో 48వ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, ప్రముఖ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు,అబ్ స్టా దర్బార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అతా నిజాం బాబా,ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈదా శ్యామలరెడ్డి చేతుల మీదుగా షీల్డ్, శాలువతో సన్మానించడంతో పాటు 5వేల చెక్ ను పరమేష్ అవార్డుతో పాటు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమను గుర్తించి ఎంతో ప్రేమతో ఉగాది పురస్కారం అందించటంతో పాటు ఆర్ధికంగా ఐదు వేల చెక్ అందించటం అభినందనీయమన్నారు.తెలంగాణ రాష్ట్రంలో తను మన సూర్యాపేట నుండి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్బంగా తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగ నాయకులు, ఉపాధ్యక్షులు పొన్నెకంటి శ్రీనివాసాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసారావు, ప్రోగ్రెసివ్ జర్నలిస్టు అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పరమేష్ కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.