EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

జిల్లా పోర్టుఫోలియో జడ్జి హైకోర్టు న్యాయమూర్తి రాధ రాణి ని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కమిటీ

Image

జిల్లా పోర్టుఫోలియో జడ్జి హైకోర్టు న్యాయమూర్తి రాధ రాణి ని కలిసిన బార్ అసోసియేషన్ నూతన కమిటీ సూర్యాపేట /కోదాడ: ఏప్రిల్ 17(దక్షిణాది న్యూస్) గురువారం సాయంత్రం హైకోర్టులో సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ శ్రీమతి రాధరాణి ని,హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ వినోద్ కుమార్ , జస్టిస్ లక్ష్మణ్ ను కోదాడ బార్ అసోసియేషన్ నూతన కమిటీ కలిసి కోదాడ కోర్టు సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్. లక్ష్మినారాయణ రెడ్డి మాట్లాడుతూ కోదాడ కోర్టు బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని, కోదాడ కు అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయాలని,ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు పి పి పల్లె నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకటరావు,దేవబత్తిని నాగార్జున రావు, రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చలం, హుస్సేన్, బండి వీరభద్రరావు పాల్గొన్నారు.