
ఆదరణ సేవలు అభినందనీయం మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ @ వ్యవస్థకు దిక్సూచిలా ఆదరణ ఫౌండేషన్ మాజీమంత్రి బాబు మోహన్ @ నిస్వార్ధంగా నిరంతర సేవలో ఆదరణ ఫౌండేషన్: కవి గాయకుడు జయరాజ్ @ ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుగా ఆదరణ: డాక్టర్ యోబు @ అందరి సహకారంతో ఆదరణను మరింత విశ్వవ్యాప్తం చేస్తాం: @ ఆదరణ ఫౌండేషన్ అధినేత అరిగెల రఘునాథ్ బాబు హైదరాబాద్, ఏప్రిల్ 17, 2025 : ఆదరణ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆదరణ ఫౌండేషన్ 22వ వార్షికోత్సవ సమావేశం జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిస్వార్ధంగా సేవలందిస్తూ ఇతర స్వచ్ఛంద సంస్థలకు దిక్సూచిలా ఉండడం హర్షణీయమన్నారు. మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం గొప్ప విషయం అన్నారు. ఆదరణ ఫౌండేషన్ అధ్యక్షులు అరిగెల రఘునాథ్ బాబు మాట్లాడుతూ సమాజానికి సేవలు అదించాలన్న సదుద్దేశంతో 2003లో ఆదరణ ఫౌండేషన్ స్థాపించి నిరుపేదలకు సేవలందిస్తున్నామని తమకు సహకరించిన అధికారులకు ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి పి బాబు మోహన్ మాట్లాడుతూ 22 ఏళ్లుగా ఆదరణ ఫౌండేషన్ స్వచ్ఛందంగా సమాజానికి సేవలందించడం అంటే వ్యవస్థకు దిక్సూచి అని అన్నారు. ఆదరణ ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. నిమ్స్ ఆర్ యం ఓ డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ ఆదరణ ఫౌండేషన్ ద్వారా అభాగ్యులకు అనాధలకు నిస్వార్ధంగా సేవలందించడం అందులో వైద్య సేవలు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. రాందేవ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు మాట్లాడుతూ నిజమైన నిరుపేదలకు, అనాధలకు అండగా ఉంటూ ఆదరణ ఫౌండేషన్ సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపుతూ నిరంతరం ఆదరణ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షులు విద్య వెంకట్ అధ్యక్షత వహించారు. ఆదరణ ఫౌండేషన్ 22వ వార్షికోత్సవ సందర్భంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భగవాన్ స్వచ్చంద సంస్థ అధినేత పి.ఎస్.ఆర్.కే భగవాన్, ఐఆర్ఎస్ అధికారి రైల్వే డైరెక్టర్ సంజీవరావు డాక్టర్ చిన్నబాబు, సినీనటి శివపార్వతి, కాంగ్రెస్ నాయకులు శేరి సతీష్ రెడ్డి, సాధు ప్రతాపరెడ్డి, మేకల మైఖేల్, టిఆర్ఎస్ నాయకులు నపారి చంద్రశేఖర్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ పిడికిటి గోపాల్ చౌదరి, టిడిపి నాయకులు అట్లూరి దీపక్, జూరీ కమిటీ చైర్మన్ ఇమ్మానియేల్, అవార్డు గ్రహీతలు, డాక్టర్ కమలాకర్ రావు, కొమురవెల్లి శ్రీనివాస్, ఆదరణ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మేరీ జోన్స్, సభ్యులు అనిషా, సన్నీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.