
సిబిఐటి కళాశాల, వ్యాయామ విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం " యోగా పై అవగాహన" అనే అంశంపై , మోటివేషనల్ స్పీకర్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఫౌండర్, బిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ బి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని తన సందేశాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందించారు, యోగాని మీ జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలి, ప్రతిరోజు యోగా చేయడం వలన ఎన్నో రకములైనటువంటి ఉపయోగాలు పొందుతారని, ముఖ్యంగా ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా యోగా గురువు డాక్టర్ సి వి రావు మరియు యోగా శిక్షకులు శ్రీ వి ఎల్ కృష్ణ ప్రసాద్ గారు, వ్యాయామ విద్య విభాగాధిపతి డాక్టర్ ఆర్ రాజేశ్వరి మాట్లాడుతూ సిబిఐటి కళాశాల అకాడమిక్స్ తో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందని మరి ముఖ్యంగా అధ్యాపకులకు యోగా తరగతులు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి నరసింహులు గారికి ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమం అనంతరం అతిధులను ఘనంగా సత్కరించారు