
వినియోగదారులకు నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో బి.ఎస్.ఎన్.ఎల్ పనిచేస్తుంది -సంస్థ పీజీఎం పవనమూర్తి అంబర్ పేట, ఏప్రిల్ 17( దక్షిణాది న్యూస్ ): వినియోగదారులకు నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో పనిచేస్తుందని బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ పీజీఎం ఏరియా -1 ఆర్.పవనమూర్తి అన్నారు. బి. ఎస్. ఎన్. ఎల్. ఆధ్వర్యంలోబాగ్ అంబర్ పేట్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో గురువారం సర్వీసు క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం చేయడం, సర్వీస్ క్వాలిటీ, మొబైల్ టారిఫ్ లను కస్టమర్లను వివరించి నూతన చేర్చుకోవడం జరుగుతుందన్నారు. బి.ఎస్.ఎన్.ఎల్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇతర నెట్ వర్క్ లతో పోలిస్తే ప్రస్తుతం బి. ఎస్. ఎన్. ఎల్. చౌకైన ధరలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ. దూసుకెళుతుందన్నారు.ఎఫ్. టి. టి. హెచ్, హై స్పీడ్, సెక్యూర్ట్, సీమ్ లెస్ కనెక్టివిటీ అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డి.జి.ఎమ్. ఎమ్. నర్సింలు, ఏ.జి. ఎం. ఎస్. మురళీ కృష్ణ , జి. రాములు, ఎన్. గోపాల్ రెడ్డి, సి. ఎ.ఓ. రత్న సదానంద్, ఎమ్. టి వి. జాహ్నవి, బి. ఎన్. ఎన్. ఎల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.