
రానున్న వర్షాకాలాన్ని పురస్కరించుకొని రోడ్లపై, బస్తీలు, కాలనీలలో వరద నీరు నిలవకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అంబర్ పేట కార్పొరేటర్ ఇ. విజయకుమార్ గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ గ్రీన్ ల్యాండ్ హోటల్, ప్రేమ్ నగర్ తదితర బస్తీలలో చేపడుతున్న వరదనీటి కాలువ అభివృద్ధి పనులను కార్పొరేటర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్టర్ కు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బస్తివాసులు పాల్గొన్నారు. -అంబర్ పేట, ఏప్రిల్ 17( దక్షిణాది న్యూస్ ).