
హైదరాబాద్, దక్షిణాది ఏప్రిల్ 12: రాజ్యాంగ రక్షణ ర్యాలీని ఈనెల 14న నిర్వహిస్తున్నామని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహన్ అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు గిరిజన శక్తి ఆధ్వర్యంలో భారీ ఎత్తున భారత రాజ్యాంగ రక్షణకై భారీ ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు వెంకటేష్ చౌహన్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద అణగారిన, గిరిజన దళిత బహుజన వర్గాలకు అన్యాయం చేస్తూ భవిష్యత్తులో వారికీ రిజర్వేషన్లను లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు.గిరిజనులు మాట్లాడే భాషలను గుర్తించకుండా అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల నుంచి బంజారా భాష "గోర్ భోలి"ని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత దేశంలో ఉండే సబ్బండ వర్గాల ప్రజలకు ఉందన్నారు.ఈ రాజ్యాంగ రక్షణ ర్యాలీ కి వచ్చే ప్రతి ఒక్కరు సూటు కోటు వేసుకొని,రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రావాలని కోరారు. గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్ల అయినా నల్లధనం పేదవారి అకౌంట్లో పడలేదని విమర్శించారు.ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని,మోడీ అంబానీ ,అదానీలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేస్తున్నారని విమర్శించారు. గిరిజన హక్కుల కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని తెలిపారు. గిరిజన శక్తి నాయకులు శ్రీమన్ నాయక్. మహేష్ నాయక్, ర్యాలీ కి మద్దతుగా బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్,ముస్లిం జేఏసీ రాష్ట్ర నాయకులు ఖదీర్.సలీమ్.ఎరుకల జేఏసీ రాజేష్.మాదిగ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు గణేష్.తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐతరాజు అభేందర్ .దళిత్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు కొండ్రపల్లి రమేష్.బి. సి. నాయకులు వేమూలూరి చారి. గిరిజన నాయకులు నాము నాయక్.మద్దతుగా ఇస్తున్నారని చెప్పారు.గిరిజన నాయకులు తరుణ్. నిఖిల్. భరత్.ఉమేష్ సోమేశ్.తదితరులు పాల్గొన్నారు.